వేములవాడ ఆలయ అభివృద్ది నిధుల కోసం పొన్నం ప్రభాకర్ ధర్నా

Published : Jun 18, 2018, 12:09 PM IST
వేములవాడ ఆలయ అభివృద్ది  నిధుల కోసం  పొన్నం ప్రభాకర్ ధర్నా

సారాంశం

సీఎం హమీలు అమలు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ధర్నా


వేములవాడ: వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన రూ.400 కోట్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  విమర్శించారు. 

వేములవాడ ఆలయ అభివృద్ది కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించిన వరాలు మాటలకే పరిమితమయ్యాయని ఆయన చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న ఆలయం మెట్లపై కూర్చొని పొన్నం ప్రభాకర్ సోమవారం నాడు ధర్నా నిర్వహించారు.అభివృద్ధి పేరుతో గుడి చెరువు పూడ్చడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

మిడ్ మానేరు అన్ని ప్యాకేజీలు కేసీఆర్‌ బంధువులకు లభించాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్ పాలనలో  ప్రజలకు ప్రయోజనం కలగలేదన్నారు.  రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని విమర్శలు గుప్పించారు. 

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ ఆథారిటీ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో కాకుండా వేములవాడలో నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేవారు.. నాలుగేళ్లు గడిచిన ఆలయ పాలక మండలి నియమించలేదని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu