డిపాజిట్లు రాని వారు అజారుద్దీన్ వెనుకున్నారు: అంజన్ కుమార్ సంచలనం

First Published Jul 16, 2018, 5:52 PM IST
Highlights

2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తాను  పోటీ చేస్తానని  మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు.  అజారుద్దీన్ ఇక్కడి వాడు కానేకాదన్నారు.వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తాననని  మాజీ క్రికెటర్ అజారుద్దీన్  చేసిన ప్రకటనపై  అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తాను  పోటీ చేస్తానని  మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు.  అజారుద్దీన్ ఇక్కడి వాడు కానేకాదన్నారు.

వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తాననని  మాజీ క్రికెటర్ అజారుద్దీన్  చేసిన ప్రకటనపై  అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రేటర్ హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు. 

అజారుద్దీన్ ఎక్కడివాడని ఆయన ప్రశ్నించారు. అజారుద్దీన్ ఇక్కడి వాడు కానేకాదన్నారు. డిపాజిట్లు కూడ రాని నేతలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో వేలు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని  ఆయన విమర్శలు గుప్పించారు.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై  చర్యలు తీసుకోవాలని  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. 

కొందరు వ్యక్తులు అజారుద్దీన్ వెనుక ఉన్నారని అంజన్ కుమార్ అనుమానిస్తున్నారు. ఈ విషయమై  రాహుల్ గాంధీ, సోనియాకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా అజారుద్దీన్ ప్రకటనలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయమై తాను ఫిర్యాదు చే

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేస్తానని మాజీ క్రికెటర్ అజారుద్దీన్  ఆదివారం నాడు ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్రం నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.  అజారుద్దీన్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీలో గందరగోళం చోటు చేసుకొంది. 

click me!