షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నా: మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి

By narsimha lodeFirst Published Feb 15, 2021, 6:04 PM IST
Highlights

 తెలంగాణలో కొత్తగా షర్మిల పెట్టబోయే పార్టీని తాను ఆహ్వానిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా షర్మిల పెట్టబోయే పార్టీని తాను ఆహ్వానిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి చెప్పారు.

సోమవారం నాడు లోటస్ పాండ్‌లో షర్మిలతో ఆయన రంగారెడ్డి  భేటీ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమానముందని ఆయన గుర్తు చేసుకొన్నారు.  ఆ అభిమానంతోనే ఆయన కూతురు షర్మిల పార్టీ పెట్టడాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి  తెలిపారు..

also read:ఆ రెండు తేదీలే: పార్టీ ప్రకటనపై షర్మిల కసరత్తు

 షర్మిలను కలిసి శుభాకాంక్షలు చెప్పడానికే తాను లోటస్ పాండ్‌కు వచ్చానని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరి సొత్తు కాదని, ఎవరైనా పార్టీలు పెట్టొచ్చని రంగారెడ్డి అన్నారు.

also read:మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి షర్మిలతో భేటీ: ఏం జరుగుతోంది?

 పార్టీ పెట్టాక పార్టీకి నా అవసరం ఉందని షర్మిల అనుకుంటే వచ్చి పార్టీకి తన సేవలు అందిస్తానని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ భేటి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా పని చేశారు. అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 
 

click me!