కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ: బీజేపీలోకి కొత్తకోట దంపతులు?

By narsimha lodeFirst Published Feb 9, 2020, 5:50 PM IST
Highlights

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో  టీడీపీ నేత కొత్త దయాకర్ రెడ్డి భేటీ కావడం  రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. 


హైదరాబాద్:  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.  పలువురు సీనియర్ నేతలు తెలుగు రాష్ట్రాల నుంచి కాషాయదళం చేరగా తెలంగాణ మంచి కూడా ఆ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఇప్పటికీ ఓ రాజ్యసభ సభ్యుడితో పాటు మాజీ  మంత్రి మోత్కుపల్లి నరసింహులు బిజెపిలో చేరారు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Also read:తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు ?

 రాజకీయంగా కొత్తకోట దంపతులకు టిఆర్ఎస్,కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బిజెపిని కొత్తకోట దంపతులు ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ ఓకే అంటే పాలమూరు జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు కాషాయ దళం లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి  తదితరులు బిజెపి గూటికి చేరారు. తాజాగా  కొత్తకోట దంపతులు బిజెపి లో చేర్చుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నాయకత్వం దిశగా అడుగులు వేసెందుకు కమల నాథులు పావులు కడుపుతున్నట్లు తెలుస్తోంది. 

 దయాకర్ రెడ్డి ప్రాథమికంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినా త్వరలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి  సహా  బిజెపిలో చేరడం లాంఛనమే అని కమలం పార్టీ నేతలు అంటున్నారు.

 దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల నుంచి దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతా దయాకర్ రెడ్డి  ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో  పనిచేసే అవకాశం దక్కింది.

 దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోట దంపతులకు పలు నియోజకవర్గాల్లో  అనుచరులు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి చేరిక పార్టీకి కలిసి వస్తుందని అంచనా బిజెపి నేతలు  అంచనా  వేస్తున్నారు.

ఇదిలా ఉంటే  రెండు రోజుల క్రితమే దయాకర్ రెడ్డి హైద్రాబాద్‌లో చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే దయాకర్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీని వీడి బీజేపీలో చేరుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

గతంలో కూడ దయకార్ రెడ్డి దంపతులు టీడీపీని వీడుతారనే ప్రచారం పలు దఫాలు సాగింది. కానీ, వారు మాత్రం టీడీపీని వీడలేదు. ఈ ప్రచారాన్ని ఖండించిన విషయాన్ని దయాకర్ రెడ్డి సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై దయాకర్ రెడ్డి దంపతులు ఏ రకంగా స్పందిస్తారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

click me!