సిద్దిపేట కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన వర్గపోరు.. మజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై రాళ్లదాడి

Published : Jun 12, 2022, 01:41 PM IST
 సిద్దిపేట కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన వర్గపోరు.. మజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై రాళ్లదాడి

సారాంశం

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. వివరాలు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీ కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్నారు.

అయితే నేడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మద్దూరు మండలం కూటిగల్​కు కారులో వెళ్తున్న ప్రతాప్ రెడ్డి కారును పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు అడ్డుకున్నారు. ఆయన కారు పైన రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ప్రతాప్ రెడ్డి, పొన్నాల వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇక, పొన్నాల వర్గీయుల దాడిలో ప్రతాపరెడ్డి కారు ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్