కేసీఆర్‌పై పోటీకి కోమటిరెడ్డి ప్లాన్: రెండు సీట్లివ్వాలని కాంగ్రెస్‌ను కోరిన రాజగోపాల్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 25, 2023, 3:29 PM IST

రెండు అసెంబ్లీ సీట్లను  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కోరుతున్నారు.ఈ విషయమై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  ను  రాజగోపాల్ రెడ్డి కోరారు.


హైదరాబాద్: రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరినట్టుగా సమాచారం.  మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరినట్టుగా తెలిసింది. 

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారంనాడు ఫోన్ లో మాట్లాడారు. టిక్కెట్టు కేటాయింపుపై  కేసీ వేణుగోపాల్ హమీ ఇచ్చారు. అయితే ఈ సమయంలో తనకు  రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.  సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న  గజ్వేల్ నుండి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు.  అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రతిపాదనపై  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్టుగా కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు.

Latest Videos

undefined

2022 ఆగస్టు మాసంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.  అయితే  ఇవాళ బీజేపీకి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు  కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నందున బీజేపీని వీడుతున్నట్టుగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పై పోటీ చేసేందుకు  ఈటల రాజేందర్ కూడ సిద్దమయ్యారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఈటల రాజేందర్ కు  బీజేపీ రెండు టిక్కెట్లను కేటాయించింది.హుజూరాబాద్ అసెంబ్లీతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కూడ బీజేపీ అభ్యర్ధిగా  ఈటల రాజేందర్ ను బీజేపీ బరిలోకి దింపింది.

అయితే గజ్వేల్ నుండి  కాంగ్రెస్ టిక్కెట్టును నర్సారెడ్డి ఆశిస్తున్నారు. అయితే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ టిక్కెట్టును కోరుతున్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గజ్వేల్ టిక్కెట్టును  కేటాయిస్తారా లేదా అనేది  రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

also read:కాంగ్రెస్‌తో కొనసాగుతున్న చర్చలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన భార్య పద్మావతికి , మైనంపల్లి హన్మంతరావుకు  ఆయన తనయుడు రోహిత్ రావుకు  కాంగ్రెస్ పార్టీ  రెండేసి అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ రెండు అసెంబ్లీ స్థానాలను కోరుతున్నారు. జానారెడ్డి తనయులు ఇద్దరు రెండు అసెంబ్లీ స్థానాలను  కోరుకున్నారు. అయితే  నాగార్జునస్థానంనుండి  జానారెడ్డి తనయుడికి కాంగ్రెస్  పార్టీ టిక్కెట్టు కేటాయించింది.సీపీఎంతో పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని  ఆ పార్టీకి కేటాయించాాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుంది.దీంతో జానారెడ్డి మరో తనయుడికి మిర్యాలగూడ టిక్కెట్టు దక్కుతుందా లేదా అనేది  సీపీఎంతో పొత్తుపై ఆధారపడి ఉంటుంది. 

click me!