బాబుకు మరో షాక్: బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

Published : Aug 17, 2019, 01:06 PM IST
బాబుకు మరో షాక్: బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

సారాంశం

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం నాడు బీజేపీలో చేరనున్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. 


మహాబూబ్‌నగర్: .జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఈ నెల 18వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన మహాబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి 2009 లో ఎర్రశేఖర్  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యాడు. 

2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర సత్యం కూడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ ఎర్ర శేఖర్ కు సోదరుడు అవుతాడు. పి. చంద్రశేఖర్ కూడ గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చంద్రశేఖర్ చేరారు.
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే