మైనర్ బాలికపై అత్యాచారం.. తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష

Published : Aug 17, 2019, 11:26 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష

సారాంశం

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బాలిక తన కన్నవారింటికి వచ్చింది. ఆ సమయంలో... పూజారి తన కన్నకూతురు అన్న విషయం మర్చిపోయి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

కన్నకూతురిపైనే కన్నేశాడు ఓ కామాంధుడు. 13ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... ఆ కామాంధుడికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...యాదాద్రికి చెందిన ఓ గుడి పూజారి తన కన్నకూతురిని  2006లో తన బంధువులకు దత్తతకు ఇచ్చాడు. అప్పటి నుంచి వారే ఆ పాపను పెంచుకుంటున్నారు. కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బాలిక తన కన్నవారింటికి వచ్చింది. ఆ సమయంలో... పూజారి తన కన్నకూతురు అన్న విషయం మర్చిపోయి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

అభ్యంతరకర వీడియోలు బాలికకు చూపించి... అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించాడు. కాగా... బాలిక ఈ విషయాన్ని తన పెంపుడు తల్లికి వివరించింది. దీంతో.. ఆమె వెంటనే అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా..  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోర్టులో హాజరు పరిచారు. అతని నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ