కొందరు పార్టీని నాశనం చేయాలని చూశారు: తుమ్మల సంచలనం

Published : Dec 27, 2021, 09:00 PM ISTUpdated : Dec 27, 2021, 09:05 PM IST
కొందరు పార్టీని నాశనం చేయాలని చూశారు: తుమ్మల సంచలనం

సారాంశం

కొందరు పార్టీని నాశనం చేయాలని చూశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఎమ్మెల్సీగా తాతా మధును గెలిపించి పార్టీ పరువును నిలిపారన్నారు. ఆశ్వరావుపేటలో ఎమ్మెల్సీ తాతామధు అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హైదరాబాద్:  పార్టీని నాశనం చేయాలని కొందరు చూశారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు  చెప్పారు.సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేటలో ఎమ్మెల్సీ తాతా మధు అభినందన సభలో Tummala nageswara rao పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారన్నారు.

ఒక చోట ఉండి మరో చోట కాపురం చేయడం మంచిది కాదని ఆయన పరోక్షంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలకు చురకలంటించారు.  ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలన్నారు.

also rfead:MLC elections : రవీందర్ సింగ్‌పై కరీంనగర్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

తాను మంత్రిగా ఉన్నప్పుడు అశ్వారావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశానని ఆయన గుర్తు చేసుకొన్నారు.  భారతదేశంలో ఫామ్ ఆయిల్ హబ్‌గా అశ్వారావుపేట దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయన్నారు.అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు

తన  గెలుపు ఉగాది పచ్చడిలా ఉందని ఎమ్మెల్సీ Thatha madhuచెప్పారు. తన  గెలుపులో తీపి, చేదు చేసింది ఎవరో మీకు తెలుసునన్నారు.
ఇప్పుడు జరిగిన తప్పే .2018 ఎన్నికల్లో కూడా జరిగిందని తాతా మధు చెప్పారు.  మన పార్టీలో కొంత మంది వల్ల 2018లో ఎమ్మెల్యేలు ఓడిపోయారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా అలానే ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

ఉమ్మడి Khammam జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి రావాల్సిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు టీఆర్ఎఃస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి పడ్డాయి.  కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో Congress కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి Trs లో చేరిన వారితో ఆ పార్టీ బలం 96కి పడిపోయింది. అయితే ఖమ్మం స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వర రావుకి 242 ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్  నుండి పెద్ద ఎత్తున  కాంగ్రెస్ కు ఓట్లు క్రాస్ అయ్యాయి. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధికి రావాల్సిన మెజారిటీ రాలేదు. అంతిమంగా టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వర్ రావుకి 242 ఓట్లు  వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.  ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. నష్ట నివారణ చర్యలు తీసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్