త్వరలోనే పలువురు నేతలు బీజేపీలో చేరుతారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. మాజీ మంత్రి ఒకరు బీజేపీలో చేరనున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాతబీజేపీలో చేరికలుంటాయన్నారు.
హైదరాబాద్: త్వరలోనే ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరుతారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. సోమవారం నాడు డాక్టర్ లక్ష్మణ్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.మునుగోడు ఉప ఎన్నికల తర్వాత చాలా మంది బీజేపీలో చేరుతారన్నారు.ఇప్పటికే తమతో పలువురు నేతలు టచ్ లో ఉన్నారని చెప్పారు. .తెలంగాణ ఉద్యమం నుండి కాంగ్రెస్ ను కేసీఆర్ ను దెబ్బతీశారన్నారు.మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.కేసీఆర్ ఎన్ని ప్లాన్ లు వేసినా కూడా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు ఉప ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్కహామీని కూడ నెరవేర్చలేదన్నారు.
గత వారంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ నెల19న నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారు.టీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సయంలో బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ నెల 20వ తేదీ నుండి బూర నర్సయ్య గౌడ్ ప్రచారం నిర్వహించనున్నారు.ఇవాళ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. బూర నర్సయ్య గౌడ్ ను పార్టీలో చేరాలని ఆహ్వానించారు. బండి సంజయ్ వెళ్లిపోయిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ నివాసానికి వెళ్లి బూర నర్సయ్య గౌడ్ ఆయనతో భేటీ అయ్యారు.