
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు వివరాలను వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టుగా తెలిపింది. మార్చి 4 ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్ష షెడ్యూల్..
15-03-2023(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
17-03-2023 (శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1
20-03-2023 (సోమవారం)- మాథమేటిక్స్ పేపర్- 1ఏ/ బోటనీ పేపర్-1/ పొలిటికల్ సైన్స్ పేపర్-1
23-03-2023(గురువారం)- మాథమేటిక్స్ పేపర్- 1బీ/ జువాలజీ పేపర్-1/ హిస్టరీ పేపర్-1
25-03-2023 (శనివారం)- ఫిజిక్స్ పేపర్-1/ ఎకానమిక్స్ పేపర్-1
28-03-2023 (మంగళవారం)- కెమిస్ట్రీ పేపర్-1 /కామర్స్ పేపర్-1
31-03-2023 (శుక్రవారం)- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1/ బ్రిడ్జ్ కోర్స్ మాథ్స్ పేపర్-1(బైపీసీ స్టూడెంట్స్)
03-04-2023 (సోమవారం)- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 / జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్ష షెడ్యూల్..
16-03-2023(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
18-03-2023 (శనివారం)- ఇంగ్లీష్ పేపర్-2
21-03-2023 (మంగళవారం)- మాథమేటిక్స్ పేపర్- 2ఏ/ బోటనీ పేపర్-2/ పొలిటికల్ సైన్స్ పేపర్-2
24-03-2023(శుక్రవారం)- మాథమేటిక్స్ పేపర్- 2బీ/ జువాలజీ పేపర్-2/ హిస్టరీ పేపర్-2
27-03-2023 (సోమవారం)- ఫిజిక్స్ పేపర్-2/ ఎకానమిక్స్ పేపర్-2
29-03-2023 (బుధవారం)- కెమిస్ట్రీ పేపర్-2/కామర్స్ పేపర్-2
01-04-2023 (శనివారం)- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2/ బ్రిడ్జ్ కోర్స్ మాథ్స్ పేపర్-2(బైపీసీ స్టూడెంట్స్)
04-04-2023 (మంగళవారం)- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2 / జియోగ్రఫీ పేపర్-2