బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు: రేపు కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి రావెల సహ పలువురి చేరిక

By narsimha lode  |  First Published Jan 1, 2023, 4:33 PM IST

ఏపీ రాష్ట్రానికి చెందిన  పలువురు   రేపు  తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్  ఐఎఎస్  తోట చంద్రశేఖర్, పార్థసారథిలు  బీఆర్ఎస్ లో  చేరుతారు.
 


హైదరాబాద్ ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు రేపు  బీఆర్ఎస్ లో చేరనున్నారు.  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, రిటైర్డ్  ఐఆర్ఎస్ అధికారి పార్థసారథిలు  బీఆర్ఎస్ లో  చేరనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్  సమక్షంలో  ఈ ముగ్గురు నేతలు  రేపు  బీఆర్ఎస్ లో  చేరుతారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్రంలో కూడా కేసీఆర్ తన పార్టీ శాఖను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చలు జరుపుతున్నారని సమాచారం.

 ఏపీ రాష్ట్రానికి చెందిన నేతలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి సంబంధాలున్నాయి.  ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా  ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందెలకు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తుంటారు .  ఏపీకి చెందిన నేతలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధాలున్నాయి.  టీడీపీలో  ఉన్న సమయంలో  ఏపీలో ఉన్న  టీడీపీకి చెందిన నేతలు టీడీపీలో క్రియాశీలకంగా  ఉండి స్ధబ్దుగా  ఉంటున్న నేతలతో  తలసాని శ్రీనివాస్ యాదవ్  చర్చిస్తున్నట్టుగా  చెబుతున్నారు. గతంలో  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో  తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామనితెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.

Latest Videos

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంచి సంబంధాలున్నాయి.  రెండు రాష్ట్రాల సీఎంలు  రెండు మూడు దఫాలు  సమావేశమయ్యారు.   అయితే బీఆర్ఎస్ పేరుతో  ఏపీలో కేసీఆర్  రాజకీయాలు ప్రారంభిస్తే  ఇరువురి నేతల మధ్య  సంబంధాలు ఎలా ఉంటాయో  భవిష్యత్తు తేల్చనుంది.  ఇప్పటికే  తెలంగాణలో  వైఎస్ షర్మిల  పార్టీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పాదయాత్ర కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా  చోటు  చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్,  షర్మిల మధ్య  మాటల యుద్ధం జరుగుతుంది.   

వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.   ఈ క్రమంలోనే  పార్టీని దేశ వ్యాప్తంగా  విస్తరించాలని  కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  తీర్మానం చేశారు.ఈ తీర్మానం కాపీని  ఈసీకి పంపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈసీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకుఈసీ పంపిన లేఖపై ఈ ఏడాది డిసెంబర్  9వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం  పెట్టారు.  న్యూఢిల్లీ కేంద్రంగా   బీఆర్ఎస్  కార్యాలయాన్ని కూడా  కేసీఆర్ ప్రారంభించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో  కూడా  కేసీఆర్ పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లోని తమ మిత్రపక్షాలతో కలిసి  బీఆర్ఎస్  పోటీ చేయనుంది.  కర్ణాటక లో  జరిగే  ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి   బీఆర్ఎస్ పోటీ చేయనుంది.ఈ విషయాన్ని  కేసీఆర్  ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!