హైద్రాబాద్ శరవేగంగా అభివృద్ది :కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో కేటీఆర్

By narsimha lode  |  First Published Jan 1, 2023, 3:12 PM IST

రాష్ట్రంలో  అనేక అభివృద్ది కార్యక్రమాలతో  తమ ప్రబుత్వం ముందుకు సాగుతుందని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.


హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంలో  హైద్రాబాద్ శరవేగంగా  ఎంతో అభివృద్ది చెందుతుందని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.ఆదివారం నాడు  కొత్తగూడలో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో  కేటీఆర్ ప్రసంగించారు. హైద్రాబాద్  అభివృద్ది గురించి సోషల్ మీడియాలో  ప్రజలు  తనకు  మేసేజ్ లు పెడుతున్నారన్నారు.  అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా భావించి తమ ప్రభుత్వం  పనిచేస్తుందన్నారు. ఇప్పటివరకు  చేసిన దానికంటే  ఇంకా  ఎంతో చేయాల్సి ఉందని  మంత్రి కేటీఆర్  చెప్పారు. తాము చేసిన అభివృద్దిని  ప్రజలు ఇంకా గుర్తంుచుకోవాలని ఆయన కోరారు. హైద్రాబాద్ సహా  రాష్ట్రంలో  ప్రజలకు  సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా  మంత్రి కేటీఆర్ వివరించారు.  హైద్రాబాద్ నగరంలో  ఎస్ఆర్ డీపీ కింద  మరో 11 ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్టుగా  కేటీఆర్  చెప్పారు. 

also read:తీరనున్న ట్రాఫిక్ కష్టాలు:కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Latest Videos

హైద్రాబాద్ లో  రూ. 1000 కోట్లతో నాలా అభివృద్ది పనులు చేస్తున్నామని మంత్రి వివరించారు. దేశంలోనే  వంద శాతం సీవరేజీ  ట్రీట్ మెంట్  సిటీగా హైద్రాబాద్ అవతరించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.రాబోయే  3 ఏళ్లలో  3,500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని  మంత్రి తెలిపారు.గత ఏడాది జనవరి  1వ తేదీన షేక్ పేట  ఫ్లైఓవర్ ను ప్రారంభించుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ  కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించుకున్నట్టుగా  చెప్పారు.
 

click me!