బీజేపీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌

Published : Jun 27, 2019, 03:41 PM IST
బీజేపీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌

సారాంశం

మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌లు గురువారం నాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌లు గురువారం నాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

గురువారం నాడు  న్యూఢిల్లీలో  జరిగిన కార్యక్రమంలో  మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్ లు బీజేపీలో చేరారు. పెద్దిరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.  బోడ జనార్ధన్ గతంలో టీడీపీలో ఉండేవాడు. 

ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు.  మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి కూడ బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో  పలువురు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?