నాయిని అంత్యక్రియలు పూర్తి: పాడె మోసిన మంత్రి కేటీఆర్

Published : Oct 22, 2020, 03:39 PM ISTUpdated : Oct 22, 2020, 03:57 PM IST
నాయిని అంత్యక్రియలు పూర్తి: పాడె మోసిన మంత్రి కేటీఆర్

సారాంశం

హైద్రాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో గురువారం నాడు మధ్యాహ్నం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం.


హైదరాబాద్: హైద్రాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో గురువారం నాడు మధ్యాహ్నం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం. నాయిని అంత్యక్రియలకు పెద్ద యెత్తున అబిమానులు వచ్చారు. కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు పాడె మోసి తమ అబిమానాన్ని చాటుకున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆయన టీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన కరోనా చికిత్స కోసం ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

కరోనా నుండి కోలుకొన్నప్పటికి ఆయనను శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డాడు. ఇదే సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు రాత్రి ఆయన మరణించాడు.బుధవారం నాడు ఉదయమే సీఎం కేసీఆర్  నాయిని నర్సింహారెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు.

ఇవాళ మధ్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్ నుండి మహాప్రస్థానం వరకు  అంతిమ యాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో నాయిని నర్సింహా రెడ్డి పార్థీవ దేహం ఉన్న పాడెను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ లు మోశారు.

కడసారి నాయిని పార్థీవ దేహాన్ని చూసేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున స్మశాన వాటికకు చేరుకొన్నారు.
పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు నాయిని పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు.

కార్మిక నేతగా నాయిని నర్సింహారెడ్డి కి పేరుంది. కార్మికనేత నుండి కేబినెట్ మంత్రిగా ఆయన ఎదిగాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో నాయిని నర్సింహా రెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు.


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?