మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం నాడు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం నాడు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సొంత ఊరు జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో రత్నాకర్ రావు అంత్య క్రియలు నిర్వహించనున్నారు.
ధర్మపురి సమీపంలోని తిమ్మాపూర్ ఆయన స్వస్థలం. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ల్యాండ్స్, మెజర్‌మెంట్స్ బ్యాంక్ చైర్మన్‌గా, జగిత్యాల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.1983లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.
1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ అల్లుడు భీమ్‌సేన్‌ను ఓడించిన జువ్వాడి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1999, 2004లో వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. వైఎస్సార్ కేబినెట్‌లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పని చేశారు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఆయనను కరీంనగర్ కు తీసుకొచ్చారు. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన మరణించారు.రత్నాకర్ రావు మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.