
హుజూరాబాద్: టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు తనకు ఉన్న ఆస్తులెన్ని, ప్రస్తుతం ఉన్నఆస్తులపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్దమేనని మాజీమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 2001లో హరీష్ రావుకి ఉన్న ఆస్తులెన్ని తనకున్న ఆస్తులెన్నో విచారణకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై ఆబిడ్స్ లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
also read:కేసీఆర్‌ను రా.. నన్ను ఓరేయ్, బీజేపీలో చేరాక భాష మారింది: ఈటలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యే కాకుండానే డైరెక్ట్‌గా మంత్రి అయినా హరీష్ రావుకు నా గురించి విమర్శించే హక్కు లేదన్నారు.
2001లో తాను టీఆర్ఎస్ లో చేరే సమయంలోనే ఓపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. 2001లో తాను పార్టీలో చేరే సమయానికి ప్రస్తుతం తనకున్న ఆస్తులపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2001లో హరీష్ రావు ఆస్తులెన్ని, ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తులెన్నో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఆరఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.హుజూరాబాద్‌లో హరీష్ రావు మోసపూరిత మాటలు విమర్శిస్తున్నారు.దుబ్బాకలో కూడ మోసపూరిత మాటలు చెప్పిన హరీష్ రావుకు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారన్నారు. ఈ నియోజకవర్గంలో కూడ ప్రజలు టీఆర్ఎస్‌కి హరీష్ రావుకి బుద్ది చెబుతారని ఆయన చెప్పారు.