తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ హైకోర్టు కాపీని ఇవాళ అందించారు.గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు కార్యాలయంలో తెలంగాణ హైకోర్టు కాపీని శుక్రవారంనాడు అందించారు మాజీ మంత్రి డీకే అరుణ. ఈ ఏడాది ఆగస్టు 24న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పు కాపీని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు డీకే అరుణ సమర్పించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవాలని ఆమె భావించారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు అందించేందుకు
డీకే అరుణ తెలంగాణ హైకోర్టు కాపీని అందించేందుకు అసెంబ్లీకి చేరింది.
also read:గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి షాక్: అనర్హత వేటేసిన తెలంగాణ హైకోర్టు
undefined
అయితే అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు కూడ అందుబాటులో లేరు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో పని ఉందని ఆయన అసెంబ్లీకి రాలేదు. దీంతో అసెంబ్లీ కార్యాలయంలో హైకోర్టు తీర్పు కాపీని డీకే అరుణ అందించారు. హైకోర్టు తీర్పు మేరకు తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాన హైకోర్టు తీర్పు కాపీ రావడానికి ఆలస్యమైందన్నారు. ఈ తీర్పు కాపీని అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. కానీ వారిద్దరూ అందుబాటులో లేరన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆమె కోరారు. హైకోర్టు తీర్పు రావడానికి ఆలస్యమైందన్నారు. ఈ తీర్పు నాలుగేళ్ల ముందే వస్తే తన నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు.