వారంతా పార్టీని వీడుతారు, బండి సంజయ్ ను తప్పించడం బాధించింది: మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలనం

By narsimha lode  |  First Published Aug 13, 2023, 12:34 PM IST

బీజేపీ నుండి మరికొందరు నేతలు  కూడ  ఆ పార్టీని వీడనున్నారని మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు  చేశారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో  బీజేపీ వైఫల్యం చెందిందన్నారు


హైదరాబాద్:ఇటీవల బీజేపీలో చేరిన  వారంతా పార్టీ నుండి బయటకు వస్తారని మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారుమాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్  బీజేపీకి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తన రాజీనామాపై  మాజీ మంత్రి చంద్రశేఖర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి  మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో  చేరాలని తనకు ఆహ్వానం ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పార్టీలో చేరాలని ఆహ్వానించారని  మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ చెప్పారు.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్,  ఉమ్మడి  రంగారెడ్డి జిల్లాలోని  చేవేళ్ల అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని  తనకు స్థానిక నేతలు  కోరుతున్నారన్నారు.  అయితే ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో ఏ స్థానం నుండి పోటీ చేయాలో  పోటీ  చేసే విషయమై  నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి తనకు  ఆఫ్షన్ ఇచ్చారన్నారు.  ఈ విషయమై  తాను  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి  గీతారెడ్డి  పోటీ చేయకపోతేనే  తాను  ఆ స్థానం నుండి పోటీ చేస్తానన్నారు.

Latest Videos

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి  బండి సంజయ్ ను తొలగించడం తనను మనోవేదనకు గురి చేసిందన్నారు. బండి సంజయ్ ను  రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించవద్దని  తాను కోరినట్టుగా  చెప్పారు. రాత్రి, పగలనక  పార్టీ కోసం బండి సంజయ్ కష్టపడ్డారన్నారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ ను  ఎదిరించడంలో  బీజేపీ వైఫల్యం చెందిందని  ఆయన  ఆరోపించారు. దీంతో  తాను  బీజేపీకి రాజీనామా చేసినట్టుగా  చెప్పారు. ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన నేతలంతా  ఆ పార్టీని వీడుతారని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.  తాను  మంత్రిగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి  ఎమ్మెల్యేగా ఉన్నాడన్నారు.

click me!