హైకోర్టు మాజీ న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత..

హైకోర్టు మాజీ న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు సోమవారం ఉప్పల్ లోని తన నివాసంలో కన్నుమూశారు. 

Google News Follow Us

హైదరాబాద్ : హైదరాబాద్ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు  తుది శ్వాస  విడిచారు. ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. భాస్కరరావు  86 ఏళ్ల వయసులో  సోమవారంనాడు  కన్నుమూశారు.  భాస్కరరావు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఘడియా గౌరారం.  1937లో  జన్మించిన  భాస్కరరావు ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేశారు. 

1963లో  న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1981లో జిల్లా సెషెన్స్ జడ్జ్ గా నియామకమయ్యారు.  1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1997లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత 1999లో పదవీ విరమణ చేశారు.  ఆయనకు  భార్య లలితాదేవి,  ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నేడు హైదరాబాదులోని మహాప్రస్థానంలో ఆయన అంతక్రియలు జరగనున్నాయి. 

Read more Articles on