ఎమ్మెల్యే పదవికి రేపే ఈటల రాజీనామా: త్వరలో బీజేపీలోకి రాజేందర్

Published : Jun 03, 2021, 01:49 PM ISTUpdated : Jun 03, 2021, 03:22 PM IST
ఎమ్మెల్యే పదవికి రేపే ఈటల రాజీనామా: త్వరలో బీజేపీలోకి రాజేందర్

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయనకు ఆ పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన సమావేశమయ్యారు.

హైదరాబాద్:  మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయనకు ఆ పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన సమావేశమయ్యారు.గత నెల 31వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ ఇవాళ ఉదయమే హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ముగించుకొని ఇవాళ ఉదయమే  ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

 

ఈ నెల 4వ తేదీన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు.  త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతల సమక్షంలో   ఆ పార్టీలో చేరనున్నారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం తనతో చర్చించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై బుధవారం నాడు పెద్దిరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు.  బండి సంజయ్ ఫోన్ తో  పెద్దిరెడ్డి మెత్తబడినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

also read:హైదరాబాదుకు రాక: బిజెపిలో చేరికపై ప్రశ్నకు జవాబివ్వని ఈటెల రాజేందర్

భూ కబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుండి  ఈటల రాజేందర్ భర్తరఫ్  అయ్యారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 4 వ తేదీనే బీజేపీలో ఏ రోజున చేరనున్నారో ఆయన ప్రకటించే అవకాశం ఉంది. మరోసారి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందనే సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?