ఇంటి దొంగలు శిఖండి పాత్ర పోషిస్తున్నారు: స్వంత పార్టీ నేతలపై తాటికొండ రాజయ్య ఫైర్

Published : Mar 10, 2023, 05:19 PM IST
ఇంటి దొంగలు శిఖండి పాత్ర పోషిస్తున్నారు: స్వంత పార్టీ నేతలపై  తాటికొండ రాజయ్య ఫైర్

సారాంశం

తనను లక్ష్యంగా  చేసుకుని  కొందరు తప్పుడు ప్రచారం  చేస్తున్నారని  మాజీ డిప్యూటీ సీఎం  రాజయ్య  చెప్పారు.  

వరంగల్: ఎన్నికలు వస్తున్నందున  తనను దెబ్బతీసేందుకు  కొందరు  ప్రయత్నం  చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం  తాటికొండ రాజయ్య  చెప్పారు.  శుక్రవారం నాడు  స్టేషన్ ఘన్ పూర్  లో  ఆయన మీడియాతో మాట్లాడారు.. ఇంటి దొంగలు శిఖండి  పాత్ర పోషిస్తున్నారని  ఆయన  ఆరోపించారు.  సీఎంను కలిసి అన్ని విషయాలను  చెబుతానన్నారు.  కొందరు తనపై కుట్రలు  చేస్తున్నారని  ఆయన  అనుమానం వ్యక్తం చేశారు.. తన నియోజకవర్గంలో ఏం జరుగుుతుందో  అన్నీ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని  ఆయన తెలిపారు. 

జానకిపురం సర్పంచ్   పరోక్షంగా  స్టేషన్ ఘన్ పూర్  ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు  చేశారు. ఓ మహిళా ప్రజా ప్రతినిధి ద్వారా తనకు రాయబారం పంపినట్టుగా  ఆమె  ఎమ్మెల్యేపై  ఆరోపణలు  చేశారు. తనపై మనసు పడినట్టుగా ఎమ్మెల్యే  రాయబారం పంపాడని  ఆమె  మీడియాకు  చెప్పారు. తనతో రాయబారం నడిపిన  మహిళా ప్రజాప్రతినిధిపై తాను ఆగ్రహం వ్యక్తం  చేసినట్టుగా  ఆమె  తెలిపారు.  తనతో పాటు  పలువురు మహిళా ప్రజా ప్రతినిధులను కూడా  ఎమ్మెల్యే  ఇదే రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె  ఆరోపించారు. తన మాదిరిగా  బయటకు రాలేని వారు ఎంతో మంది  ఉన్నారని  ఆమె  మీడియాకు  తెలిపారు.  మహిళా సర్పంచ్ ఆరోపణలు  చేసిన తర్వాత  ఈ విషయమై  ఎమ్మెల్యే  రాజయ్య  వివరణ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్