బాత్రూంలో కాలు జారిపడ్డ మాజీ సీఎం కేసీఆర్..

Published : Dec 08, 2023, 08:23 AM ISTUpdated : Dec 08, 2023, 11:13 AM IST
బాత్రూంలో కాలు జారిపడ్డ మాజీ సీఎం కేసీఆర్..

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాలికి స్వల్ప గాయం అయ్యింది. గురువారం అర్థరాత్రి తరువాత ఆయన ఫాం హౌజ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. 

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలికి గాయం అయ్యింది. ఆయన ఫాం హౌజ్ లో గురువారం అర్థరాత్రి బాత్రూంలో కాలు జారి పడ్డారు. పంచె తగులుకుని పడ్డట్టుగా సమాచారం. దీంతో  కేసీఆర్ ఎడమకాలికి గాయం అయ్యింది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే వెంటనే కేటీఆర్, కవితలతో సహా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్టుగా చెబుతున్నారు. రాత్రి ఆస్పత్రికి రాగానే అవసరమైన పరీక్షలు నిర్వహించారు వైద్యులు. శుక్రవారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కేసీఆర్ కు శుక్రవారం సాయంత్రం హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స చేయనున్నారు. 

దీనికోసం నలుగురు ఆర్థోపెడిక సర్జన్లు హాజరవ్వనున్నారు. ప్రస్తుతం ఇద్దరు సర్జన్లు ఆయనను పరీక్షిస్తున్నారు. మరో ఇద్దరు సర్జన్ల సహకారంతో సాయంత్రం ఆపరేషన్ జరగనున్నట్లు సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?