కూకట్ పల్లిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ పాడుపని... ఇళ్ళలోకి చొరబడి వీరు చేస్తున్న నిర్వాకమిది...

By Arun Kumar PFirst Published Dec 24, 2021, 11:03 AM IST
Highlights

ఫుడ్ డెలివరీ కోసం వచ్చి కస్టమర్ల కళ్లుగప్పి దొంగతనాాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులకు కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు. 

హైదరాబాద్: వారి వ‌ృత్తి ఫుడ్ డెలివరీ చేయడం. ప్రవృత్తి మాత్రం దొంగతనం. ఫుడ్ డెలివరీ (food delivery) చేయడానికి వెళ్లిన ఇళ్లలో ఖరీదైన వస్తువులతో పాటు ల్యాప్ టాప్ లు, ఐప్యాడ్ దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను కూకట్ పల్లి (kukatpally) పోలీసులు అరెస్ట్ చేసారు.  

సంగారెడ్డి జిల్లా (sangareddy district)కు చెందిన శివాజీ పాటిల్(23), బోయిని వెంకటేశం(21), గోవర్ధన్ రెడ్డి స్నేహితులు. వీరు ముగ్గురు ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే జల్సాలకు అలవాటుపడ్డ వీరు ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టారు. ఇందుకోసం వారు చేసే ఫుడ్ డెలివరీ పనినే ఉపయోగించుకున్నారు. 

ఫుడ్ డెలివరీ కోసం వెళ్లే ఇళ్లలోనే వీరు దొంగతనాలను పాల్పడటం ప్రారంభించారు. డెలివరీ కోసం వెళ్లిన సమయంలో కస్టమర్ల కళ్లుగప్పి ల్యాప్ టాప్, ఐప్యాడ్ వంటి ఖరీదైన వస్తువులను దొంగిలించేవారు. ఇలా ఇప్పటివరకు వీరు ఏడు ల్యాప్ టాప్ లతో పాటు ఓ ఐప్యాడ్ ను దొంగిలించారు.  

read more  గోవా నుండి డ్రగ్స్ సరఫరా, ముగ్గురి అరెస్ట్: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

అయితే ఇలా దొంగిలించిన వస్తువులను అమ్మడానికి ఈ ముగ్గురూ కెపిహెచ్బి కాలనీలోని పద్మావతి ప్లాజాకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడే పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా తచ్చాడపసాగారు. దీంతో వీరిని గమనించిన పోలీసులు వీరిని పట్టుకుని బ్యాగ్ ను తనిఖీ చేయగా ల్యాప్ టాప్ లు, ఐప్యాడ్ కనిపించాయి. వీటి గురించి ప్రశ్నించగా సమాధానం రాకపోవడంతో పోలీస్టేషన్ కు తరలించారు. 

పోలీసుల విచారణలో ల్యాప్ టాప్, ఐప్యాడ్ దొంగిలించినట్లు శివాజీ, వెంకటేశం, గోవర్ధన్ ఒప్పుకున్నారు. ఫుడ్ డెలివరీ కోసం వెళ్ళిన సమయంలో ఎలా వీటిని తస్కరించారో వివరించారు. దీంతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుండి ఏడు ల్యాప్ టాప్ లు, ఐపాడ్ తో పాటు బైక ను స్వాధీనం చేసున్నారు.  

click me!