
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్ర నగర్‌లో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఉదయం స్కూల్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ధాన్యం కుప్పలను ఢీకొట్టింది. ఈ వేగానికి పల్టీలు కొట్టి బోల్తా కొట్టింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన టీచర్లను బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.