పెద్దపల్లి సుల్తానాబాద్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ను ఢీకొన్న కారు: ఐదుగురికి గాయాలు

Published : Jul 28, 2023, 10:00 AM IST
పెద్దపల్లి సుల్తానాబాద్ వద్ద  ట్రాన్స్‌ఫార్మర్ ను ఢీకొన్న కారు: ఐదుగురికి గాయాలు

సారాంశం

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద ఇవాళ  ప్రమాదం  జరిగింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను  కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో  ట్రాన్స్ ఫార్మర్ ను కారు ఢీకొంది.  ఈ సమయంలో కారులో  ఐదుగురు ప్రయాణీస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న తర్వాత  కారులోని  నుండి ప్రయాణీకులు బయటకు వెళ్లేందుకు  ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టారు. కారులోని ఐదుగురిని బయటకు తీశారు.  కారులో  ఉన్న ఐదుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ప్రమాదంలో గాయపడిన  వారిని  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కారు అదుపుతప్పి  ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొనడానికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్