పవన్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు: రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు...

Published : Sep 02, 2020, 06:58 AM ISTUpdated : Sep 02, 2020, 07:36 AM IST
పవన్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు: రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు...

సారాంశం

తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. లారీ కారును ఢీకొట్టడంతో ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.

వరంగల్: తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రమాదం సంభవించింది. 

ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబీర్, పవన్ లుగా గుర్తించారు. వారంతా వరంగల్ జిల్లాలోని పోచం మైదాన్ కు చెందినవారని పోలీసులు చెప్పారు. 

కారును లారీ ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగింది. ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారు నుజ్జు నుజ్జు అయింది. పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానకిి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రమాదానికి ముందు కారులో ప్రయాణిస్తున్నవారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఆ తర్వాత వరంగల్ నుంచి ములుగు వైపు కారులో బయలుదేరారు. కారు ఎదురుగా వస్తున్న లారీని దాటబోయి లారీని ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది.

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu