
Fisherman drowns in tank while fishing: సిద్దిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టుకురావడానికి వెళ్లిన ఒక మత్స్యకారుడు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తొగుట మండలం కనగల్ గ్రామంలోని చెరువు వద్దకు చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడి కాళ్లు చేపల వలలో చిక్కుకోవడంతో నీట మునిగి చనిపోయాడని స్థానికులు చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. తొగుట మండలం కనగల్ గ్రామంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చేపల వలలో కాళ్లు ఇరుక్కుపోయి నీట మునిగి మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కాముని శ్రీనివాస్ (35)గా గుర్తించారు. అతని మృతదేహాన్ని చెరువు నుంచి ఇతర మత్స్యకారులు బయటకు తీశారు.
గత వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ నెల 6న చేపలు పట్టే క్రమంలో చేపలు పట్టే వలలో కాళ్లు ఇరుక్కుపోయిన గోదాల రాజు మరణించాడు. మెదక్ పట్టణ సమీపంలోని పిట్లం బేస్ చెరువులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చేపలు పట్టే వలలో కాళ్లు ఇరుక్కుపోవడంతో రాజు నీటిలో మునిగి చనిపోయాడని స్థానికులు చెప్పారు.