ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కాసేపట్లో ఫలితాలు

By sivanagaprasad kodatiFirst Published Jan 21, 2019, 2:00 PM IST
Highlights

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ముగిసింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం మధ్యాహ్నాం 1 గంటకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ను నిలిపివేశారు. మొత్తం 3,701 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 12, 202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 

28,976 వార్డులకు గాను 70, 094 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఓట్లు వేసేందుకు అధిక మొత్తంలో యువత పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు తరలివెళ్లింది. పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో 1 గంటలోపు ఓటర్లు క్యూలైన్‌లో నిలబడి ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాలు లెక్కించిన తర్వాత సర్పంచ్ స్థానాల సంఖ్యను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
 
click me!