మహిళా ఉద్యోగినికి డీన్ లైంగిక వేధింపులు: పీఎస్ ఎదుట నిరసన

By Nagaraju TFirst Published Jan 21, 2019, 12:58 PM IST
Highlights

మంగళవారం లోగా డీన్ శ్రీనివాస్ ను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించకపోతే కళాశాల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. 

హైదరాబాద్: తార్నాకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మహిళా ఉద్యోగినిపై డీన్  లైంగిక వేధింపుల ఆగడాలు బట్టబయలయ్యాయి. కళాశాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల డీన్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. 

ఇంతకాలం మౌనంగా భరించిన ఆమె అతడి వేధింపులు తీవ్రతరం కావడంతో ఆమె ఆందోళనకు దిగింది. విద్యార్థి సంఘాలతో కలిసి ఓయూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగింది. డీన్ ను కఠినంగా శిక్షించాలంటూ ఓయూ పీఎస్ ఎదుట విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.

మంగళవారం లోగా డీన్ శ్రీనివాస్ ను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించకపోతే కళాశాల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యాజమాన్యంతో మాట్లాడతామని విద్యార్థి సంఘాలకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
 

click me!