
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో మొదటి రోజు విచారణ ముగిసింది. సాదుద్దీన్ మాలిక్‌ను 6 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఈ సందర్భంగా అతని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అయితే మొదటి రోజు విచారణలో సాదుద్దీన్ పోలీసులకు సహకరించలేదని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు దాటవేసే సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో రేపు అతనిని మరోసారి విచారించనున్నారు పోలీసులు. అలాగే ముగ్గురు మైనర్స్‌ని ప్రశ్నించనున్నారు పోలీసులు. జువెనైల్ హోంలోనే కస్టడీ విచారణ సాగనుంది.
ఇకపోతే.. అత్యాచారం కేసులో (amnesia pub rape case) జువైనల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్ట్. రేపటి నుంచి 4 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. 14వ తేదీ సాయంత్రం వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి 4 రోజుల పాటు మైనర్లను విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా వున్న సాబుద్దీన్ మాలిక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఐదుగురిని కలిపి రేపటి నుంచి విచారించబోతున్నారు పోలీసులు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే మనవడు, ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిని కార్పోరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. మాయమాటలు చెప్పి ఆమెను కారులో ఎక్కించాడు. ముందుగా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు ఎమ్మెల్యే కొడుకు. బాలిక కళ్లద్దాలు, మొబైల్ లాక్కొన్నారు నిందితులు. అవి ఇవ్వాలంటే ఇన్నోవాలో ఎక్కాలని బెదిరించినట్లుగా తెలుస్తోంది. పబ్ లోపలికి వెళ్లేందుకు వీలుగా యాజమాన్యం ఇచ్చిన tagలు ఆమెకు తెలియకుండా తెంచేశారు. ఆమె మళ్లీ pub లోకి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఆమెను ఇంటి దగ్గర దింపుతామంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నారు’.. జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలు పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ALso Read:మైనర్ బాలికను అతనే ట్రాప్ చేశాడు: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
మే 28న అత్యాచార ఘటన తర్వాత జూన్ 2న భరోసా కేంద్రంలో బాధితురాలితో ఓ మహిళా పోలీస్ అధికారి మాట్లాడారు. ‘నాకు నిందితులెవరూ పరిచయం లేరు. నా స్నేహితురాలు ఇంటికి వెళ్తాను అంటే మేము ఇద్దరం బయటకు వచ్చాం. ఆమె క్యాబ్లో వెళ్ళిపోయింది. మాతో పాటు నలుగురు నిందితులు వచ్చారని’ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. మే 28, సాయంత్రం పబ్ నుంచి బయటికి వచ్చిన బాలిక ఇంటికి వెళ్లేందుకు.. పబ్ లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతడు సమాధానం ఇవ్వలేదు. పక్కనే ఉన్న నిందితులు క్యాబ్ బుక్ చేస్తామంటూ ఆమె ఫోన్ లాక్కున్నారు. మొబైల్ డేటా సరిగా లేదు.. మేము దింపుతాం అంటూ బెంజ్ కారులో ఆమెను ఎక్కించుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆమె బ్యాగ్ కళ్ళజోడు తీసుకున్నాడు. బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తుండగానే.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కాన్సు బేకరీ వద్దకు వచ్చాక… ఈ కారు ఇరుకుగా ఉందని, మరో కారు వస్తుందని చెప్పారు. తన ఫోన్, కళ్ళజోడు, బ్యాగ్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాను అని ఆమె బతిమాలినా వినలేదు. బెదిరించి మరో కారులో తీసుకువెళ్లారు.
చిరునామా తెలియక… వస్తువులు దొరక…
‘బేకరీ వద్ద ఇన్నోవాలో ఎక్కేందుకు 15 నిమిషాల వ్యవధి ఉంది. ఆ సమయంలో బయటికి వచ్చి ఎవరినైనా సహాయం అడగవచ్చు. ఎవరికైనా చెప్పి పోలీసులకు ఫోన్ చేయించవచ్చు కదా’ అని ఆ అధికారిని బాలిక వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అది తనకు తెలియని ప్రాంతం కావడంతో ఏమి చేయలేక పోయానని బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. పైగా తన కళ్ళజోడు, ఫోను, బ్యాగ్ తిరిగి ఇవ్వకపోవడంతో వాటికోసమే తాను కారులోనే ఉన్నానని వివరించినట్లు సమాచారం.