ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తి బస్తాలకు అంటుకున్న మంటలు..

Published : Jun 10, 2023, 02:24 PM IST
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో భారీ అగ్ని  ప్రమాదం.. పత్తి బస్తాలకు అంటుకున్న మంటలు..

సారాంశం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి మార్కెట్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. 

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి మార్కెట్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలంలో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. మంటలు పత్తి బస్తాలకు అంటుకోవడంతో దాదాపు వెయ్యి బస్తాల పత్తి దగ్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వాటిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. 

భారీగా పత్తి బస్తాలు ధ్వంసం కావడంతో.. భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్‌ యార్డ్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ.. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ‌లోని ఈ న‌గ‌రం మ‌రో హైద‌రాబాద్ కావ‌డం ఖాయం.. ఎయిర్‌పోర్ట్ స‌హా కీల‌క ప్రాజెక్టులు
Kondagattu పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని Pawan Kalyan ఎందుక‌న్నారు? | Anjaneya Swamy | Asianet News Telugu