మణికొండలోని ప్లే స్కూల్‌ అగ్ని ప్రమాదం.. ఆందోళనతో స్కూల్ వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు..

By Sumanth Kanukula  |  First Published Jun 20, 2023, 12:18 PM IST

హైదరాబాద్ మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లే స్కూల్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.


హైదరాబాద్ మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లే స్కూల్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ప్లే స్కూల్‌లోని చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్కూల్‌లో నుంచి పిల్లలను బయటకు పంపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్లే స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. 

మరోవైపు జోల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు.. వెంటనే అక్కడికి చేరుకుని తమ పిల్లల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. వారి పిల్లలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. మరోవైపు ప్లే స్కూల్ సిబ్బంది.. చిన్నారులను  వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.

Latest Videos

ఇక, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్లే స్కూల్‌లో 100 మంది వరకు చిన్నారులు ఉన్నారని చెబుతున్నారు.  అయితే పిల్లలకు ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. 

click me!