సకినాలు చేస్తుండగా అగ్ని ప్రమాదం.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సతీమణికి గాయాలు..

Published : Jan 08, 2022, 09:15 AM ISTUpdated : Jan 08, 2022, 09:54 AM IST
సకినాలు చేస్తుండగా అగ్ని ప్రమాదం.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సతీమణికి గాయాలు..

సారాంశం

జగిత్యాల ఇంట్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ( kalvakuntla vidyasagar rao) ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. 

జగిత్యాల ఇంట్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ( kalvakuntla vidyasagar rao) ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. సంక్రాంతి పండుగకు సకినాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు సతీమణి సరోజకు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో ఉన్నారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.  ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్