పెద్ద అంబర్‌పేట కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Sep 17, 2021, 11:38 AM IST
పెద్ద అంబర్‌పేట కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్ పెద్ద అంబర్ పేటలో కెమికల్ ఫ్యాక్టరీలో  శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం కారణంగా భారీ శబ్దాలు విన్పించినట్టుగా స్థానికులు చెప్పారు.


హైదరాబాద్: పెద్ద అంబర్ పేటలోని కెమికల్ ఫ్యాక్టరీలో  శుక్రవారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.పెద్ద అంబర్‌పేటలోని స్వాల్ కార్పోరేషన్ లిమిటెడ్ గోడౌన్ లో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమాచారం అందుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అంతేకాదు భారీగా శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలు చెందారు.కెమికల్ ఫ్యాక్టరీలో గేట్లను జేసీబీలతో తొలగించి ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలను ఐదు ఫైరింజన్లు ఆర్పుతున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్