మూడో సంవత్సరం విద్యార్థులు దుస్తులు ఊడదీయించి ర్యాగింగ్ చేయడంతో అతను విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సమాచారం.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని మూడో సంవత్సరం విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థి ఉత్తరప్రదేశ్ లో ఓ కీలక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిసింది.
మూడో సంవత్సరం విద్యార్థులు దుస్తులు ఊడదీయించి ర్యాగింగ్ చేయడంతో అతను విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సమాచారం. డీఎంఈ రమేష్ రెడ్డి బుధవారం వరంగల్ కేఎంసీకి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది.
కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ ను వివరణ కోరగా ర్యాగింగ్ చేసిన వారు క్షమాపణ చెప్పారని, ఈ అంశం సద్దుమణిగిందన్నారు. ఈ చర్యతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు సమాధానపడలేదని, వరంగల్ లోనే ఉన్నారని తెలిసింది.