హైద్రాబాద్ అల్విన్ కాలనీలో అగ్ని ప్రమాదం: ట్రాఫిక్ మళ్లింపు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 11:15 AM IST
Highlights

హైద్రాబాద్ కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు గుర్తించారు.  ఇతర దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మంటలను ఆర్పుతున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ ఆల్విన్ కాలనీలో బుధవారం నాడు ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్నారు.

 

హైద్రాబాద్ ఆల్విన్ కాలనీలో బుధవారం నాడు ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్నారు. pic.twitter.com/5douibEvMD

— Asianetnews Telugu (@AsianetNewsTL)

కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో గల బట్టల దుకాణంలో  షార్ట్‌ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  ఫైర్ ఫైటర్లు శ్రమిస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆల్విన్ కాలనీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.  రెండు పైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.  ఈ ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ఉన్న ఇతర షాపుల్లోని వారిని కూడ అక్కడి నుండి పంపారు. 

click me!