బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం.. కోటీన్నర ఆస్తినష్టం, సురక్షితంగా బయటపడ్డ 10 మంది

Published : Sep 18, 2018, 08:17 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం..  కోటీన్నర ఆస్తినష్టం, సురక్షితంగా బయటపడ్డ 10 మంది

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని మెయిన్‌బజార్‌లో ఉన్న కృష్ణా ఫ్యాషన్స్‌లో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని మెయిన్‌బజార్‌లో ఉన్న కృష్ణా ఫ్యాషన్స్‌లో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగసిపడి పక్కనున్న నివాసాలకు వ్యాపించాయి.

పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయకపోవడంతో... కొందరు స్థానికులు ద్విచక్ర వాహనంపై ఫైర్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసరికి గంట ఆలస్యం కావడంతో ప్రమాద తీవ్రత పెరిగి దుకాణం మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో కోటీన్నర విలువ చేసే ఆస్తినష్టం జరగ్గా.. 10 మంది సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

"

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు