మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. షాపులో చెలరేగిన మంటలు..

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 10:36 AM IST
Highlights

మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.

మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. బస్టాండ్ సెంటర్‌లో ఉన్న  ఓ షాపులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక, అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్‌లోని ఐదు అంతస్థుల వాణిజ్య భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. భారీగా దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కొన్ని గంటలపాటు చుట్టుముట్టింది. ఈ ప్రమాదం తీవ్రత భారీగా ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రమాదం పక్కనే నివాసాల్లో ఉండేవారిని ఖాళీ చేయించారు. ఏడు గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగినప్పటీ నుంచి అక్కడున్న ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో.. పోలీసులు వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. 

అయితే స్లాబ్ విరిగిపోవడంతో భవనం కూలిపోయే అవకాశం ఉన్నందున రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది శుక్రవారం లోపలికి వెళ్లలేకపోరు. భవనంలో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తుల ఆచూకీ కోసం అధికారులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు కూడా మరోసారి వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. భవనం నిర్మాణ స్థిరత్వాన్ని నిపుణులు విశ్లేషించారని.. ఆ నివేదిక సమర్పించిన తర్వాత కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 
 

click me!