ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తి నష్టం..!

Published : Oct 27, 2021, 10:44 AM ISTUpdated : Oct 27, 2021, 10:45 AM IST
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తి నష్టం..!

సారాంశం

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్ రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తం విస్తరించాయి.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్ రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తం విస్తరించాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. భారీ అగ్ని ప్రమాదం వల్ల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: హైద‌రాబాదీల‌కు హ్యాపీ న్యూస్‌.. ఇక రోడ్డు క్రాస్ చేయడానికి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు
Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్