మా ఇంటి ఓట్లన్నీటీఆర్ఎస్ కే, ఇటు రావొద్దు: ఫ్లెక్సీ కట్టిన రైతు

Published : May 10, 2019, 09:46 AM IST
మా ఇంటి ఓట్లన్నీటీఆర్ఎస్ కే, ఇటు రావొద్దు: ఫ్లెక్సీ కట్టిన రైతు

సారాంశం

సారంగపూర్ మండలం జౌళి గ్రామానికి చెందిన దయాకర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి పనులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని స్పష్టం చేస్తున్నాడు.   

నిర్మ‌ల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో తెలియజేశాడు ఓ రైతు. మా ఇంటి ఓట్లన్నీ టీఆర్ఎస్ కే నంటూ ఒక ఫ్లెక్సీ పెట్టేశాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటి గోడకు కట్టేశాడు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జౌళి గ్రామానికి చెందిన దయాకర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి పనులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని స్పష్టం చేస్తున్నాడు. 

తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా లబ్ధి పొందానని అందువల్ల తమ కుటుంబం టీఆర్ఎస్ కే ఓటు వేస్తోందని చెప్తున్నాడు.  తమ ఇంట్లో ఉన్న 11 ఓట్లన్నీ టీఆర్ఎస్‌కే అంటూ ప్లెక్షీలో రాయించాడు. 

అంతేకాదు తాను టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలనుకున్న అంశంపై కూడా ఫ్లెక్సీపై స్పష్టంగా వివరణ ఇచ్చాడు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్సీలో తెలుపుతూ ఓటు ఎందుకు వేస్తామో వివరించాడు. ఆస‌రా ఫించ‌న్లు, రైతుబంధు ప‌థ‌కాలతో తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచినందుకు ఓటు వేయాలనుకుంటున్నట్లు రైతు దయాకర్ చెప్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ