కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

Published : Feb 01, 2022, 06:32 AM IST
కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

సారాంశం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు. ఆసుపత్రి మొత్తం పొగలు వ్యాపించాయి.  విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆసుపత్రి అంధకారంలో ఉంది. ఆసుపత్రిలో మొత్తం 70 మంది చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు.  ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. మంటలు అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ : Hyderabad  కూకట్ పల్లి లోని Holistic hospitalలో Fire accident చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా Smoke కమ్ముఉన్నాయి. పొగల దాటికి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోగులను అంబులెన్స్ లలో ఎక్కించి సిబ్బంది వెరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పి వేస్తున్నారు.

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే Arikepudi Gandhi ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యుత్ 
Short circuit కారణంగా మంటలు వ్యాపించినట్లు ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు. ఆసుపత్రి మొత్తం పొగలు వ్యాపించాయి.  Power supply నిలిపివేయడంతో ఆసుపత్రి అంధకారంలో ఉంది. ఆసుపత్రిలో మొత్తం 70 మంది చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు.  ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. మంటలు అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రోగులకు ఇబ్బంది లేకుండా వారిని ఇతర ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరి 16న సికింద్రాబాద్ లో ఇలాగే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. secunderabad clubలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 16వ తేదీ.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్దమైంది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. 

అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1878లో బ్రిటీష్‌ హయాంలో మిలటరీ అధికారులు కోసం ఈ క్లబ్‌ నిర్మించారు.. దాదాపు 20 ఎకరాల విస్తీరణంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ను నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. ఈ క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. సంక్రాంతి కావడంతో శనివారం క్లబ్‌ను ముసివేసినట్లు తెలుస్తోంది.

కాగా, జనవరి 6న ఢిల్లీలోని చాందినీ చౌక్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. ఢిల్లీలోని Chandni Chowkలో జనవరి 6 తెల్లవారుజామున major fire accident జరిగింది. ఈ ఘటనలో దాదాపు 60 దుకాణాలు, స్టాళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పేందుకు 12 Fire engines ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఎర్రకోట ఎదురుగా ఉన్న Lajpat Rai Market‌లో తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సంఘటన స్థలంలో తీసిన వీడియోల్లో మంటలు నాల్కలు చాచి విరుచుకుపడుతుండడం కనిపిస్తోంది. మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. బూడిదగా మారిపోయాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనే దానిపై ఇంకా సమాచారం లేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం