హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న ఫైరింజన్లు

Siva Kodati |  
Published : Feb 11, 2023, 05:46 PM IST
హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న ఫైరింజన్లు

సారాంశం

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో టైర్ల దుకాణానికి సంబంధించిన పాత గోడౌన్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. టైర్ల దుకాణానికి సంబంధించిన పాత గోడౌన్‌లో శనివారం మంటలు చెలరేగాయి. భారీ ట్రాఫిక్ దృష్ట్యా ఘటనాస్థలికి చేరుకోలేకపోతున్నాయి ఫైరింజన్లు. చాదర్‌ఘాట్‌లోని ప్రధాన రోడ్‌లో ట్రాఫిక్‌ను మళ్లించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. ముంబైలోని గిర్‌గావ్‌ ఎల్‌ఐసీ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని రెండో అంతస్తులో గురువారం (ఫిబ్రవరి 9) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పలు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

గతేడాది కూడా ఎల్‌ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

గతేడాది కూడా ముంబైలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 7 మే 2022న ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కార్యాలయ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!