భార్యాభర్తల మద్య గొడవపెట్టిన బిర్యాని

Published : Nov 17, 2017, 02:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
భార్యాభర్తల మద్య గొడవపెట్టిన బిర్యాని

సారాంశం

బార్యను బిర్యాని కోసం చితకబాదిన భర్త  బిర్యాని రుచిగా లేదనేది కారణం అతడి ఇంటిముందు దర్నాకు దిగిన మహిళ

పసందైన చికెస్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కానీ బిర్యాని  కోసం బార్యనే వదిలేసేంత కాదు కదండి. ఏంటి చికెన్ బిర్యాని కోసం బార్యను వదిలేయడం ఏమిటి, అసలు ఎక్కడ జరిగిందీ సంఘటన అనుకుంటున్నారా అయితే ఈ స్టోరి మీరు చదవాల్సిందే.
వరంగల్ అర్బన్ జిల్లా ఇల్లందుకు చెందిన కూరపాటి రాజేంద్రప్రసాద్‌ కు వర్ధన్నపేటకు చెందిన మానసతో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిపైన రాజేంద్రప్రసాద్ బార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు బాగా తాగి వచ్చి బార్యతో బిర్యాని చేయించుకున్నాడు. అయితే ఆమె చేసిన బిర్యాని నచ్చలేదని, ఇది కూడా చేయడం చేతకాదా అంటూ గొడవకు దిగాడు. ఈ గొడవను అదునుగా చేసుకుని బార్యను పుట్టింటికి పంపించాడు.
భర్త కోపం తగ్గాక వస్తాడని ఏడాది నుంచి ఎదురుచూసి విసుగు చెందిన మానస పోలీసులను ఆశ్రయించింది. వారి నుంచి సహకారం లేకపోవడంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు దర్నాకు దిగింది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్