దుబ్బాకలో దారుణం:ఇద్దరు చిన్నారులపై తండ్రి అత్యాచారం, కేసు నమోదు

Published : Oct 09, 2022, 09:49 AM IST
దుబ్బాకలో దారుణం:ఇద్దరు చిన్నారులపై తండ్రి అత్యాచారం, కేసు నమోదు

సారాంశం

సిద్దిపేట జిల్లాలోని  దుబ్బాకలో  ఇద్దరు చిన్నారులపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.  చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది.  ఇద్దరు చిన్నారులపై సవతి తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలికలు కేకలు వేయడంతో స్థానికులు రాగానే నిందితుడు పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళకు మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు అప్పటికే  ఇద్దరు కూతుళ్లు.  ఇద్దరు  కూతుళ్లలో ఒకరి వయస్సు 8 ఏళ్లు.మరొకరి వయస్సు 6 ఏళ్లు.  భర్త చనిపోవడంతో ఆమె మరొకరిని మూడేళ్ల క్రితం  పెళ్లి చేసుకుంది. ఉపాధి కోసం భార్యాభర్తలు దుబ్బాకకు వచ్చారు. దుబ్బాకలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం నాడు  వివాహిత పిల్లలను ఇంట్లో వదిలి కూలీ పనులకు వెళ్లింది. అయితే ఆ సమయంలో  ఇంట్లో ఉన్న ఆమె భర్త ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి  పాల్పడడంతో  బాధితులు భయంతో కేకలు వేశారు.దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. చుట్టు పక్కల వాళ్లు రావడంతో నిందితడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ విషయాన్నిస్థానికులు చిన్నారుల తల్లికి సమాచారం ఇచ్చారు. బాధితురాలు దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు  తల్లి ఇద్దరు చిన్నారులను భరోసా సెంటర్ కు తరలించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలుతీసుకు వచ్చినా కూడా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. రోజు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.