ఓదేలు, బోడిగె శోభలను అప్పుడే హెచ్చరించా...కానీ...: మందకృష్ణ

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 3:06 PM IST
Highlights

తెలంగాణలో మాదిగ జాతిని సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగనివ్వకుండా ఈ పాలకులు అడ్డుకుంటున్నారని ఎమ్మార్పీఎఫ్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాదని మాల వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు. ఇలా మాదిగ జాతిని అంతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని మందకృష్ణ మండిపడ్డారు.

చెన్నూరు టికెట్ నల్లాల ఓదేలుకు రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన గట్టయ్య మృతదేహాన్ని పరిశీలించారు మందకృష్ణ మాదిగ. గట్టయ్య కుటుంబసభ్యులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లాల ఓదేలును టీఆర్ఎస్ నాయకులు భయపెట్టి లొంగదీసుకున్నారని ఆరోపించారు. ఇలా వారి బెదిరింపుల వల్ల ఓదేలు  ఆత్మభిమానాన్ని కోల్పోయి సుమన్ కు మద్దతిస్తానని ఒప్పుకున్నారని తెలిపారు.

అయితే టికెట్ విషయంలో తాను గతంలోనే నల్లాల ఓదేలు, బొడిగె శోభలను హెచ్చరించినట్లు మందకృష్ణ తెలిపారు. తమ నియోజకవర్గాల టికెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ స్థానాల్లో రాజకీయాలు జరగవచ్చని సూచించినట్లు తెలిపారు. అయితే తన హెచ్చరికలను వారు అంత సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు  బాధపడుతున్నారని అన్నారు. 

మాదిగ కులానికి చెందిన ఓదేలు సిట్టింగ్ స్థానం చెన్నూరు నియోజకవర్గాన్ని మాల కులానికి చెందిన బాల్క సుమన్ కు ఎలా కేటాయిస్తారని మందకృష్ణ ప్రశ్నించారు. ఇలా మాదిగ కులాన్ని అవమానించిన టీఆర్ఎస్ ఓటమికోసం తాను పనిచేస్తానని...అదే గట్టయ్యకు తాము సమర్పించే నిజమైన నివాళి అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. 

Last Updated Sep 19, 2018, 3:12 PM IST