కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు..ఎవరూ లేని సమయంలో

Published : Oct 14, 2019, 12:40 PM IST
కన్నకూతురిపై కన్నేసిన కామాంధుడు..ఎవరూ లేని సమయంలో

సారాంశం

భార్య, ఇతర కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఆదివారం సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి... ఈ విషయం అందరికీ తెలిస్తే.. తనను కొట్టి చంపుతారేమోనని భయపడి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... బాలిక ఈ విషయాన్ని తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై దారుణానికి  ఒడిగగట్టాడు.  కన్న కూతురిపైనే ఓ కామాంధుడు కన్నేశాడు. అందులోనూ చిన్న పిల్ల అన్న కనికరం కూడా లేకుండా... మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ లో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... షాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నాలుగు నెలలుగా షాబాద్ లో అద్దెకు ఉంటున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.  సదరు వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో రోజు వారీ కూలీగా పనిచేస్తూ... కుటుంబాన్ని పోషించేవాడు.

కాగా... అతని కన్ను ఇటీవల సొంత కూతురిపైనే పడింది. బాలిక వయసు కేవలం 13 సంవత్సరాలే కావడం గమనార్హం. భార్య, ఇతర కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఆదివారం సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి... ఈ విషయం అందరికీ తెలిస్తే.. తనను కొట్టి చంపుతారేమోనని భయపడి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... బాలిక ఈ విషయాన్ని తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?