ఎవరైనా చంపారా, తానే కాల్చుకున్నాడా: విద్యార్ధి మరణంపై అనుమానాలు

Siva Kodati |  
Published : Apr 30, 2019, 07:49 AM ISTUpdated : Apr 30, 2019, 09:06 AM IST
ఎవరైనా చంపారా, తానే కాల్చుకున్నాడా: విద్యార్ధి మరణంపై అనుమానాలు

సారాంశం

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్కే పురం బాలాజీ కాలనీకి చెందిన సోహైల్ అనే విద్యార్ధి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌లో ఇంటర్ విద్యార్ధి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్కే పురం బాలాజీ కాలనీకి చెందిన సోహైల్ అనే విద్యార్ధి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మహారుద్దీన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు.

ఈ క్రమంలో సోహైల్ సోమవారం అర్ధరాత్రి మంచంపై నిర్జీవంగా పడివున్నాడు. అతని తలలో తుపాకీతో కాల్చిన గుర్తు వుంది. ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డడా.. ? లేదంటే ఎవరైనా కాల్చారా అన్నది పోలీసులకు అంతు పట్టడం లేదు.

అతని తండ్రి ఆర్మీలో పనిచేశాడు కాబట్టి లైసెన్స్‌డ్ గన్ ఉంటుంది.. ఇంటర్ ఫెయిల్ అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నప్పటికీ మరేదైనా కోణం వుందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్