పదేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. అంతకు ముందు తల్లిని కూడా...(వీడియో)

Published : May 11, 2023, 01:12 PM IST
పదేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. అంతకు ముందు తల్లిని కూడా...(వీడియో)

సారాంశం

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఓ తండ్రి తన పదేళ్ల కూతురిని గొడ్డలితో నరికి చంపాడు. అంతకు ముందు కొద్ది రోజుల క్రితం భార్యను కూడా చంపాడని స్థానికులు చెబుతున్నారు. 

పెద్దపల్లి : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం బత్తుపల్లిలో సదయ్య అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పదేళ్ల తన కుమార్తె రజితను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అతను కూతురి మీద ఈ దారుణానికి ఒడి గట్టాడు. 

కూతురిని చంపి తరువాత గ్రామంలోని మరో వ్యక్తి మీద కూడా సదయ్య గొడ్డలితో దాడి చేశాడు. గుండ్ల సదయ్యకు గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. దీంతో గ్రామంలో జనాలపై తరచుగా దాడులకు పాల్పడుతున్నాడు.

కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై కూడా దాడి చేశాడు. కాగా, అంతకు ముందు అతను భార్యను కూడా ఇలాగే చంపాడని స్థానికులు చెబతున్నారు. అతడిని వదిలిపెట్టొద్దని చంపేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని పొట్టన బెట్టుకున్నాడని, ప్రాణానికి ప్రాణం సమాధానం అంతే అంటూ ఆగ్రహానికి వస్తున్నారు.

అతడిని మానసిక స్థితి సరిగా లేదని చెబుతూ ఎన్నిసార్లు వదిలేస్తారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే రోజు రోజుకూ ఊర్లో భయంభయంగా బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నపిల్ల చేసిన పాపం ఏమిటని.. అంత దారుణంగా చంపేశాడని ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?