విషాదం: కారు వెనుక ఆడుకుంటున్న చిన్నారి.. చూసుకోని తండ్రి

Siva Kodati |  
Published : Feb 15, 2019, 07:59 AM IST
విషాదం: కారు వెనుక ఆడుకుంటున్న చిన్నారి.. చూసుకోని తండ్రి

సారాంశం

హైదరాబాద్ బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కారు కింద పడి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... మీర్‌పేట నందిహిల్స్ కాలనీలో ఉండే కృష్ణ, జ్యోతిలకు ఇద్దరు సంతానం.. కృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో కృష్ణ గురువారం ఉదయం తన డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.. అప్పటి వరకు ఇంట్లో తల్లిదండ్రుల ముందు ఆడుకున్న 20 నెలల చిన్నారి గౌతమ్... తండ్రి వెళ్లడం గమనించి..పాకుకుంటూ వెళ్లి కారు వెనక కూర్చొన్నాడు.

అయితే ఈ విషయాన్ని కృష్ణ గమనించకుండా.. చిన్నారి మీదుగా వెనక్కిపోనిచ్చాడు. కొడుకు కనిపించకపోవడంతో జ్యోతి ఇళ్లంతా వెతికింది, బయటకు వచ్చి చూడగా చిన్నారి గాయాలతో పడి ఉన్నాడు. కంగారుపడిన ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది..

దీంతో ఇంటికి వచ్చిన కృష్ణ వెంటనే చిన్నారిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ గౌతమ్ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్